Monday, May 7, 2012

అమ్మ


ఉదయ సూర్యుని ఓలె నొప్పారు ప్రేమ
ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ
హృదయాన మాత్రమే ఇమిడడీ ప్రేమ
ఈరేడు లోకాల నిమిడించు ప్రేమ 
పది నెలలు మోయగా పండిన ప్రేమ 
పది కాలముల పాటు పదిలమౌ ప్రేమ 
పది కోట్లకైనను పడి పోని ప్రేమ 
పరమాత్ముడైనను పడి చచ్చు ప్రేమ 


మన తల్లి తరువోజ మన మనః పూజ
మన జన్మమున కామె మధుమాధ వేజ 


ఈ కవిత డా.శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచితంబైనది...