Friday, August 29, 2014

Infosys లో నా ప్రయాణం!!!

జులాయి గా తిరిగే నన్ను ఉల్వల్లాయీ అంటూ శిక్షణ ఇచ్చి,  క్రమశిక్షణ నేర్పిన Infosys, నీకు జోహారు!

నీ ఒడిలో 8 వసంతాలు చూశాను... నీ బడి లో 8 ఏళ్ళు నేర్చుకున్నాను... 

అడగ్గానే Onsite ఇచ్చావు... అడక్కుండా CRR 1+ ఇచ్చావు... 

పని చెయ్యడం లో ఇంపును పరిచయం చేసావు.... లోకంలో Infosys అనే గుర్తింపునిచ్చావు... 

ఎల్లప్పుడూ గుర్తుండే ఆత్మీయులనిచ్చావు... సమాజంలో నెగ్గుకురాగల సామర్ధ్యతనిచ్చావు... 

Infosys అనే ఆకాశంలో ఒక తారనౌతాను... Infosys Product గా మెలిగి నీకు వన్నె తెస్తాను... 

--- ఈ రోజు (29-Aug -2014) Infosys లో నా చివరి రోజు... 

---ఈ కవిత Infosys కి అంకితం....................