ఓ రామచిలకా ... నా రామచిలకా
ఎక్కడున్నావు ఎక్కడున్నావు ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
ఊరిలో షికారని వెళ్ళావు ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
జామపళ్ళు , లేతకొబ్బరి తెచ్చాను ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
నీకు కొసరి కొసరి తినిపిస్తాను ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
చెట్టు మీద ఉన్నావా ... పుట్ట మీద ఆగావా ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
నీ ముద్దు పలుకులకై వేచాను ... ఓ రామచిలకా
సందెవేళ చీకటయ్యే ... నా రామచిలకా !!!
వచ్చావా వచ్చావా ... ఓ రామచిలకా
నిన్ను చూసాకే నాకు జీవమోచ్చిందే ... నా రామచిలకా !!!
తిన్నావా తిరిగావా ... ఓ రామచిలకా
నీ ముద్దు మాటలు విననిదే పొద్దు పోదు నాకు ... నా రామచిలకా !!!
నిదురపో నిదురపో ... ఓ రామచిలకా
ఈ రేయి జాబిలిని చూస్తూ ... నా రామచిలకా !!!
-- బాల జితేంద్ర (కృష్ణప్రియ - కలం పేరు)
No comments:
Post a Comment